కృష్ణా: నందివాడలో ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశ్వరి పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపుదలకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ అమీర్ భాష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.