సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 189 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 30 రన్స్ ఆధిక్యంలో ఉండగా.. బ్యాటర్లలో రాహుల్(39) మినహా ఎవరూ 3 పదుల స్కోర్ దాటలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 159 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.