PLD: పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లుట్ల రోడ్, లెనిన్ నగర్లోని స్తూపం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో సిబ్బంది విధులు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, మందుల సరఫరా పరిస్థితి, కేంద్ర పరిసర పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు.