బాపట్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తాము నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా మన గ్రామాలు ఆరోగ్యకరంగా, అందంగా మారగలవని ఆయన స్పష్టం చేశారు.