NZB: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ROB పనుల పురోగతి అంశాలపై సమీక్ష నిర్వహించారు.