KRNL: నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతంలో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. జమ్మిచెట్టు వద్దనున్న 10 ఎంఎల్డీ ఎస్టీపీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, హంద్రీ నది నీటి ప్రవాహం పెరిగే సందర్భాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు వంటి అంశాలపై ఆయన విచారణ చేసినట్లు పేర్కొన్నారు.