KMM: ప్రతి ఒక్కరూ డయాబెటిస్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని కల్లూరు పీహెచ్సీ డాక్టర్ నవ్యకాంత్ తెలిపారు. ఇవాళ మధుమేహ నివారణపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, శారీరక శ్రమ ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ రామారావు, సీహెచ్ రాణి సహా సిబ్బంది పాల్గొన్నారు.