NLG: వేములపల్లి మండలం రావులపెంట, శెట్టిపాలెం గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జడ్పీ సీఈవో శ్రీనివాసరావు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా మధ్యాహ్న భోజనం నాణ్యతను, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని వంట సిబ్బందికి ఆయన సూచించారు.