KMR: చెరువులను ఆక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువును ఆయన శనివారం పరిశీలించారు. జిల్లాలోని పలు చెరువు కుంటలు కబ్జా అవుతున్నాయనే విషయాన్ని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయగా ఆయన చెరువును సందర్శించారు.