MNCL: భీమారం మండలం MPPS అర్కేపల్లి పాఠశాలలో ఎస్సై శ్వేత తన కూతురును శనివారం చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్చుకున్న విద్యార్థులు వివిధ రంగాలలో విజయవంతంగా రాణిస్తున్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు SI గుర్తు చేశారు. తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలతోనే సాధ్యమన్నారు.