గుంటూరు జిల్లాలోని 5.85 లక్షల రేషన్ కార్డుల్లో ఇప్పటివరకు 5.30 లక్షల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తయిందని జేసీ అశుతోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. మిగిలిన కార్డుల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. రేషన్ కార్డుల్లో సవరణలు అవసరమైతే గ్రామ, వార్డు సచివాలయాలను వెంటనే సంప్రదించాలి అని జేసీ సూచించారు.