BDK: ములకలపల్లిలో 3.25 కోట్ల రూపాయల వ్యయంతో బాలుర వసతి గృహ నిర్మాణాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. విద్యా, ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెల్లడించారు.