WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల పాఠశాలలో భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఇవాళ జనజాతి గౌరవ దివాస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల కోసం ఆంగ్లేయుల అణచివేతకు ఎదిరించి పోరాడిన మహా యోధుడు భగవాన్ బిర్సా ముండా అని పేర్కొన్నారు.