SKLM: పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నరసన్నపేట మండలం జమ్మూ గ్రామంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే జిల్లాను పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నారు. ఇంటింటా నూరు శాతం చెత్త సేకరణ జరగాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరే చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.