SS: హిందూపురం వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్టేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. టీడీపీ అనుచరులు కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రమాణాలు కూలిపోతున్న సంకేతాలేనని పేర్కొన్నారు. దీనిపై పోలీసుల నిర్వాకం ఆందోళనకరమని Xలో చేసిన ట్వీట్లో విమర్శించారు.