PDPL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్లో పాఠశాలల పర్యవేక్షణ, ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల నిర్వహణపై అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాలలో పడిన ఆర్బీఐ నిధులను వెనక్కి తీసుకునేందుకు రిక్వెస్ట్ లెటర్లు తీసుకోవాలన్నారు.