కోనసీమ: రానున్న వేసవి నాటికి అయినవిల్లి 400/132 కే.వీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేసి లో వోల్టేజ్ లేని విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం సబ్ స్టేషన్ వద్ద పలు రికార్డులు తనిఖీ చేసి, చేపట్టిన పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు.