PPM: కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి పిలుపు అందినట్లు కలెక్టర్ కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి. ఈ నెల 20, 21 తేదీలలో మనాలిలో జరగబోయే జియోస్పెషియల్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేలపై జరిగే ప్యానెల్ చర్చలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్లు పేర్కొన్నారు.