KKD: కాకినాడ సిటీ, రూరల్ సర్కిల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏడు వేర్వేరు కేసుల్లో రూ. 42.6 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన క్రైమ్ విభాగం పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.