VZM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ CII భాగస్వామ్య సదస్సులో చివరి రోజు శనివారం స్థానిక MLA అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తొలి రోజేకే రూ.11.92 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగాయని, దీంతో 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, ప్రపంచంలోని ప్రసిద్ద కంపెనీలు విజయనగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.