MBNR: దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇవాళ క్యాంపు ఆఫీస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.