ELR: అశోక్ నగర్ KPDT హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను ఉపాధ్యాయులు పరిశీలించిన తర్వాతే విద్యార్థులకు అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. తరచూ పరిశీలనలు చేస్తానని, నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.