TG: రాష్ట్రంలోని 61 లక్షల మంది స్వయం సహాయ సంఘాల(SHG) మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 50 లక్షల చీరలు జిల్లాలకు చేరాయి. గత ఏడాది సెప్టెంబరులో సీఎం రేవంత్ ప్రకటించిన ఈ పథకం కోసం రూ.318 కోట్లు విడుదలయ్యాయి. నవంబర్ 19(ఇందిరాగాంధీ జయంతి) లేదా డిసెంబర్ 7(ప్రభుత్వ ఏర్పాటు రోజు)న పంపిణీ చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.