KNR: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫైన్ చెల్లించలేనన్న మనోవేదనతో చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పోలీసులకు పట్టుబడిన విజయ్ శనివారం కోర్టుకు హాజరైనప్పటికీ మేజిస్ట్రేట్ లేకపోవడంతో తిరిగి వచ్చాడు. దీంతో మనస్తాపానికి గురై ఆర్థిక ఇబ్బందుల భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.