శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్(అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటీస్) కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీంతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది. అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ 04735203232ను సంప్రదించమంది.