AP: ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఇవాళ పాడేరులో పర్యటించనున్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సభ, విగ్రహావిష్కరణకు మోహన్ చరణ్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.