SRD: ఇవాళ స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్బంగా కలెక్టరేట్లో ఓ కార్యక్రమంలో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అటవీ జాతుల హక్కులు, గిరిజనుల అభ్యున్నతి, స్వాభిమాన రక్షణ కోసం బిర్సా ముండా చేసిన త్యాగాలు నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.