SKLM: పేద కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. ఇవాళ ఆమదాలవలస, బూర్జ మండలాల్లో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.7 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.