W.G: బాలికల విద్య సమాజానికి వెలుగునిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాణి అన్నారు. ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమంలో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం మండలం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘బాలల హక్కులు- విద్య’ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు 19 ఏళ్లు వచ్చిన తర్వాతే వివాహాలు చేయాలన్నారు. తద్వారా గర్భస్థ దశలో ఇబ్బందులు ఉండవన్నారు.