సీఐడీ కార్యాలయంలో నటుడు దగ్గుబాటి రానా విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం కేసులో సీఐడీ అధికారులు రానాను దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం రానా మాట్లాడుతూ.. అనుమతి ఉన్న యాప్ అని తెలిశాకే ప్రచారం చేశానని, యాప్ గురించి న్యాయ బృందం విచారణ చేసిందని తెలిపాడు. వివరాలన్నీ సీఐడీ అధికారులకు వివరించానని పేర్కొన్నాడు.