డార్క్ చాక్లెట్స్‌ను క్రమం తప్పకుండా మోతాదులో తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి తగ్గించి మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శరీర నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.