కడప: మైదుకూరులో జరుగుతున్న బైపాస్ నిర్మాణంలో నేషనల్ హైవే అధికారులు రైతు రామ్మోహన్‌కు చెందిన 8 సెంట్ల భూమిని అదనంగా తీసుకున్నారని, 3 నెలలుగా డబ్బులు చెల్లించలేదని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు డబ్బులు చెల్లించకపోతే రైతులతో కలిసి రోడ్డును దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.