కోనసీమ: గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో రూ. 1 కోటి 71 లక్షలతో నిర్మించనున్న 4 రోడ్లు, డ్రైనేజ్ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధిని ప్రధాన అజెండాగా పెట్టుకుని ముందుకు సాగుతోందన్నారు.