KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని తుని ఎమ్మెల్యే యనమల దివ్య భర్త గోపీనాథ్‌తో కలిసి శనివారం దర్శించారు. వీరికి దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం వేదపండితుల ఆశ్వీరవచనాలు అందజేసి స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు.