AP: సింగపూర్-విజయవాడల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో మొదటి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు CM చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. కాగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్‌కు నేరుగా విమానాలు చేరుకోనున్నాయి.