కరీంనగర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ శ్రీనివాస్ కూతురు నిఖిత బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీలో సత్తా చాటింది. తండ్రి కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివిన నిఖిత, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో వర్సిటీ సెకండ్ ర్యాంక్‌తో పాటు గోల్డ్ మెడలు సాధించింది. ఈ సందర్భంగా నిఖిత పలువురు అభినందించారు.