‘SSMB 29’ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ ఈవెంట్ కోసం సునీల్ ఆవుల అనే మహేష్ అభిమాని 6817km దూరం ప్రయాణం చేసి HYD వచ్చాడు. సింగపూర్ నుంచి 12 గంటల పాటు ప్రయాణం చేసి హైదరాబాద్కు చేరుకున్నాడు. దీనిపై రాజమౌళి తనయుడు ట్వీట్ పెట్టాడు. ‘ఒక తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్ ఇదే. ఆకాశం నీ హద్దు’ అంటూ రాసుకొచ్చాడు.