CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన ట్యాంక్‌ను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన రూ. 6.74 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్యాంక్ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చొరవతో కుప్పం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించారు.