AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా అబ్బిరాజుపాలెంలో రూ. 55 లక్షలతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సీఐఐ సదస్సులో జరిగిన ఒప్పందాలతో ఎంతో మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.