భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఆటముగిసే సమయానికి 93/7 స్కోర్ చేసింది. ఇప్పటి వరకు 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులకు ఆలౌటయ్యాయి.