ATP: రాప్తాడు మండల అధికారుల ఆధ్వర్యంలో పండమేరు వెంకటరమణ స్వామి దేవస్థానం వద్ద ఇవాళ జరిగిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా అధికారులతో కలిసి ఉసిరి చెట్టు నాటి పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేటి తరం యువత సాంప్రదాయాలను విస్మరిస్తోందని, అధికారులు ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.