KRNL: ప్రస్తుత సమాజంలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పిలుపునిచ్చారు. శనివారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యక్తిగత, సమాజ పరిశుభద్రత ర్యాలీని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.