ఉమ్మడి పశ్చిమ గోదావరి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా రవి చంద్ర పదవి బాధ్యతలను శనివారం స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని డీఎస్పీ తెలిపారు. మహిళ లు మరియు బాలికల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, మహిళలపై జరిగే నేరాల విషయంలో వేగవంతమైన, పారదర్శకమైన విచారణకు కృషి చేస్తామని పేర్కొన్నారు.