W.G: నరసాపురం పట్టణం పరిధిలోని చిన్న మామిడిపల్లిలో ఉన్న రామ సాయి మందిరం వద్ద శనివారం కార్తీక మాసం సందర్భంగా గణపతి హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దంపతులు ఈ గణపతి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హాజరై పూజలు చేశారు.