NZB: జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య పలు సూచనలు చేస్తూ శనివారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాలలో విగ్రహ ప్రతిష్టలు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ డీజే పూర్తిగా నిషేధం అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దన్నారు. ఇంకా డ్రోన్స్ ఉపయోగించడానికి, భారీ సభలకు ముందస్తు అనుమతి పోలీసుల నుంచి తప్పనిసరి తీసుకోవాలని కోరారు.