TG: HYDలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీపీ సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేశారు. డబ్బులు పంపించాలని సజ్జనార్ పేరిట మెసేజ్లు పంపారు. దీంతో ఆయన స్నేహితుడు రూ. 20వేలు పంపించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఇలాంటి మోసాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. మోసాలపై 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.