‘SSMB 29’ మూవీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలో మహేష్.. తన తండ్రి, దివంగత నటుడు కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈరోజు మిమ్మల్ని నేను కాస్త ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాను నాన్న.. మీరు గర్వపడతారని నాకు తెలుసు నాన్న’ అంటూ రాసుకొచ్చాడు.