కోనసీమ: స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మాధవి తెలిపారు. ఈ క్రమంలో శనివారం స్థానిక కలెక్టరేట్ సిబ్బందితో కలిసి జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు.