VZM: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. జీవన రాణి అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే ‘లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్’ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని (ఆటో) జెండా ఊపి ఆమె ఇవాళ ప్రారంబించారు.