ASF: ఒకప్పుడు ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించింది సిర్పూర్ పేపర్ మిల్ పరిశ్రమ. కానీ ఇప్పుడు న్యాయం కోసం కార్మికుల భిక్షాటనకు వేదికగా మారిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీలో ఎన్నికల విషయంపై యాజమాన్యం హైకోర్టుకు వెళ్లి కార్మిక సంఘాలకు నోటీసులను పంపించింది. దీంతో కోర్టు వ్యయాల కోసం కార్మికులు శనివారం భిక్షాటన చేశారు.